Train Theft: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకి యత్నం
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:21 AM
గుంటూరు రైల్వే డివిజన్ పల్నాడు జిల్లా పరిధిలో రైళ్లను ఆపి అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున న్యూపిడుగురాళ్ల జంక్షన్ దాటిన తర్వాత తుమ్మలచెరువు రైల్వేస్టేషన్...
పిడుగురాళ్ల, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే డివిజన్ పల్నాడు జిల్లా పరిధిలో రైళ్లను ఆపి అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్‌చల్ చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున న్యూపిడుగురాళ్ల జంక్షన్ దాటిన తర్వాత తుమ్మలచెరువు రైల్వేస్టేషన్ చేరుకునే సమయంలో భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న విశాఖ ఎక్ప్‌ప్రెస్ రైలు 3.30 గంటల సమయంలో నిలిచిపోయింది. అప్పటికే రైలులో ప్రయాణిస్తున్న దుండగులు ఎస్-1 బోగీలో ప్రవేశించి మహిళలను బెదిరించారు. వారు కేకలు వేయడంతో పక్క బోగీలోని తెనాలి రైల్వే ఎస్‌ఐ వెంకటాద్రి, కానిస్టేబుళ్లు శేషయ్య, సురేంద్ర అక్కడికి చేరుకున్నారు. దుండగులను గుర్తించిన ఎస్‌ఐ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో వారు అద్దంకి-నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారివైపు పరుగులు తీశారు. ఈ వారంలో ఇదే ప్రాంతంలో దొంగలు మూడు సార్లు తెగబడడం గమనార్హం.