Share News

Bapatla accident: సరదాగా సముద్ర తీరానికి వచ్చి ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి

ABN , Publish Date - May 21 , 2025 | 04:02 AM

బాపట్ల జిల్లా చీరాల సమీపంలో వాడరేవు వద్ద కారుప్రమాదం చోటు చేసుకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు, ఒకరు కార్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నారు.

Bapatla accident: సరదాగా సముద్ర తీరానికి వచ్చి ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి

వాడరేవు రోడ్డులో ఇరుసు విరిగి కారు బోల్తా

మరో ఐదుగురికి గాయాలు

చీరాల, మే20(ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాల సమీప వాడరేవు సముద్రతీరంలో సరదాగా గడిపేందుకు స్నేహితులతో వచ్చిన గుంటూరుకు చెందిన ముగ్గురు యువకులు కారు బోల్తాపడటంతో మృత్యువాతపడ్డారు. వారిలో ఇద్దరు విద్యార్థులు కాగా, ఒకరు కారు మెకానిక్‌గా పనిచేస్తున్నారు. వివరాలు... గుంటూరులోని ఓ పాలిటెక్నిక్‌ కళాశాలకు చెందిన నాయక్‌(20), కార్తీక్‌(19), అజయ్‌(20), ప్రాణేష్‌, సామ్యేల్‌, దేవదత్త, హోసన్నా, శశాంక్‌, వెంకటనాగసాయి గుంటూరులో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారు అద్దెకు తీసుకుని మంగళవారం చీరాల సమీపంలోని రామాపురం సముద్రతీరానికి వచ్చారు. అక్కడ సరదాగా గడిపి సాయంత్రం తిరిగి వెళుతుండగా వాడరేవు వద్ద చేపలు కొనాలని అందరూ అనుకోవడంతో నాయక్‌ వేగంగా కారు వెనక్కు తిప్పాడు. ఈ క్రమంలో కారు ముందు చక్రం వద్ద ఇరుసు విరిగిపోవడంతో టైరు కారు నుంచి విడిపోయింది. వేగం అదుపుకాక రెండు పల్టీలు కొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాయక్‌, అజయ్‌ కారులోనే మృతి చెందగా, కార్తీక్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రాణేష్‌ మినహా అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 04:02 AM