Share News

Visakhapatnam : దంపతుల హత్య

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:59 AM

విశాఖ దువ్వాడలో ఓ దంపతులు హత్యకు గురయ్యారు. ఇంట్లో రక్తపు మడుగులో కనిపించిన యోగీంద్రబాబు, లక్ష్మి దంపతుల హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Visakhapatnam : దంపతుల హత్య

విశాఖలో దారుణం

24 గంటల తరువాత వెలుగులోకి

కూర్మన్నపాలెం (విశాఖపట్నం), ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలోని దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దంపతులు హత్యకు గురయ్యారు. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నేవల్‌ డాక్‌యార్డు రిటైర్డ్‌ ఉద్యోగి గంపల యోగీంద్రబాబు (66), ఆయన భార్య లక్ష్మి(52) గత 30 ఏళ్లుగా జీవీఎంసీ 86వ వార్డు రాజీవ్‌ నగర్‌లో నివాసముంటున్నారు. ఐదు రోజుల క్రితం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వెళ్లి రెండ్రోజుల క్రితం తిరిగివచ్చారు. శుక్రవారం సాయంత్రం యోగీంద్రబాబు ఇంటికి ఆయన మేనల్లుడు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఫోన్‌ చేస్తే ఇంట్లో రింగ్‌ అవుతుండడంతో అనుమానం వచ్చి కిటికీ తలుపులు తీసి చూడగా.. రక్తపు మడుగులో యోగీంద్రబాబు కనిపించారు. వెంటనే 100కి ఫోన్‌ చేశారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీ టి.త్రినాథ్‌, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాళం పగులగొట్టి లోపలకు వెళ్లి చూస్తే హాల్‌లో యోగీంద్రబాబు, మరో రూమ్‌లో లక్ష్మి రక్తపు మడుగులో పడిఉన్నారు. బంగారం, నగదు కోసం కోసం ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగి 24 గంటలు అయి ఉంటుందని (బహుశా గురువారం రాత్రి) పోలీసులు చెబుతున్నారు. కాగా.. వీరి ఇద్దరు పిల్లలు సుజిత్‌, శిల్ప ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 07:12 AM