Tragedy In Sri Sathya Sai District: పెను విషాదం.. ప్రాణం తీసిన ఖర్జూరం..
ABN , Publish Date - Dec 07 , 2025 | 08:28 AM
ఖర్జూర పండు విత్తనం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెనుకొండ పట్టణానికి చెందిన 46 ఏళ్ల గంగాధర్ ఖర్జూరం తింటూ ఉండగా గింజ గొంతులో ఇరుక్కుంది. తర్వాత అది ఊపిరితిత్తులలోకి వెళ్లింది. దీంతో ఊపిరి ఆడక అతడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అదృష్టం బాగా లేనపుడు అరటి పండు తిన్నా పళ్లు ఊడిపోతాయని ‘వేదం’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. మన అదృష్టం బాగా లేనపుడు పళ్లు ఊడిపోవటం కాదు.. ప్రాణాలు కూడా పోవచ్చు. ఇందుకు శ్రీ సత్య సాయి జిల్లాలో చోటుచేసుకున్న తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. ఖర్జూరం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఖర్జూరం తింటూ ఉండగా విత్తనం గొంతులో ఇరుక్కుంది. అది కాస్తా ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో ఊపిరాడక ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ పట్టణానికి చెందిన 46 ఏళ్ల గంగాధర్ గతంలో ఫ్లెక్సీలు తయారు చేసే వాడు. ప్రస్తుతం కార్లు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. గంగాధర్ గత కొంతకాలంనుంచి గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. గురువారం రాత్రి ఇంట్లో ఖర్జూర పండ్లు తింటూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఖర్జూర విత్తనం అతడి గొంతులో ఇరుక్కుంది. తర్వాత అది నేరుగా ఊపిరితిత్తులలోకి వెళ్లింది. గంగాధర్ ఊపిరి ఆడక అల్లాడసాగాడు.
ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు పరిస్థితి సీరియస్‌గా ఉందని చెప్పటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరో పెద్ద ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. గంగాధర్‌ను అనంతపురానికి తీసుకెళుతుండగా మార్గం మధ్యలోనే అతడు చనిపోయాడు.
ఇవి కూడా చదవండి
గోవా అగ్నిప్రమాద ఘటన..ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని
ఆ రాశి వారికి ఈ వారం ఆర్ధికంగా బాగుంటుంది...