Share News

నేడు ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీ

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:34 PM

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఆదివారం కర్నూల్లో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీని నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ, అంజిబాబు పిలుపునిచ్చారు.

    నేడు ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీ
మాట్లాడుతున్న ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ

కర్నూలు అగ్రికల్చర్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఆదివారం కర్నూల్లో ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీని నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాధాకృష్ణ, అంజిబాబు పిలుపునిచ్చారు. శనివారం కేకే భవనలో శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు సాగించిన రైతు ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసిందన్నారు. రైతు ఉద్యమానికి తలవంచి రద్దు చేసిన చట్టాలను తిరిగి కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నదని అన్నారు. దీనికి నిరసనగా ఆదివారం చేపట్టనున్న ట్రాక్టర్‌, బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనందబాబు, డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అబ్దుల్లా, కేజీబీఎస్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణ, రైతు సంఘం నాయకులు మధు, రామాంజనేయులు, కృష్ణ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:34 PM