Share News

నేడు ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో ‘కిసాన దినోత్సవం’

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:35 PM

నగరంలో బళ్లారి రోడ్డులోగల ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో శనివారం ఉదయం 11 గంటలకు ‘కిసాన దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు కర్నూలు ఆకాశవాణి కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దేవరబొట్ల మురళి ఒక ప్రకటనలో తెలిపారు.

నేడు ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో   ‘కిసాన దినోత్సవం’

కర్నూలు కల్చరల్‌, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): నగరంలో బళ్లారి రోడ్డులోగల ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో శనివారం ఉదయం 11 గంటలకు ‘కిసాన దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు కర్నూలు ఆకాశవాణి కేంద్రం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దేవరబొట్ల మురళి ఒక ప్రకటనలో తెలిపారు. ఆకాశవాణి కేంద్రంలో ఏటా ఫిబ్రవరి 15న రేడియో కిసాన దినోత్సవం నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో ‘కిసానవాణి’ ప్రసారాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ రైతు సాధికార సంస్థ, ఏపీ కమ్యూనిటీ మానేజ్‌డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ చీఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన అధికారి డాక్టర్‌ వి.లక్ష్మినాయక్‌, విశిష్ట అతిథిగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధికారి డాక్టర్‌ ఎం.జాన్సన, గౌరవ అతిథులుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పీఎల్‌ వరలక్ష్మి, పశువైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని రైతులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హాజరై, వ్యవసాయ, సాంకేతిక విషయాలపట్ల అవగాహన కలిగించుకోవాలని సూచించారు.

Updated Date - Feb 14 , 2025 | 11:35 PM