Share News

Tirupati SP: కనిపించని పోలీసులు మీరే

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:18 AM

తిరుపతి ఎస్పీ హర్షవర్ధనరాజు శుక్రవారం తిరుమలలోని ట్యాక్సీ డ్రైవర్లతో సమావేశమయ్యారు. ట్యాక్సీ డ్రైవర్లు, ఎవరైనా అనుమానాస్పద వస్తువులు తీసుకువస్తే 112 నంబరుకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు.

Tirupati SP: కనిపించని పోలీసులు మీరే

తిరుమల ట్యాక్సీ డ్రైవర్లతో ఎస్పీ హర్షవర్ధనరాజు

తిరుమల, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ‘మేము కనిపించే పోలీసులం. తిరుమల ట్యాక్సీడ్రైవర్లు కనిపించని పోలీసులు. కొన్నిసార్లు డ్రైవర్లు ఇచ్చే చిన్న సమాచారమే పెద్దపెద్ద ఉపద్రవాల నుంచి కాపాడుకునేందుకు అవకాశం ఇస్తుంది’ అని తిరుపతి ఎస్పీ, టీటీడీ సీవీఎస్వో (ఎఫ్‌ఏసీ) హర్షవర్ధనరాజు అన్నారు. పహల్‌గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో 450 మంది ట్యాక్సీ డ్రైవర్లు, ఓనర్లతో శుక్రవారం ఎస్పీ సమావేశ మయ్యారు. తిరుమలకు ఎవరైనా నిషేధిత వస్తువులు తీసుకొస్తున్నట్లు తెలిసినా, నేరస్తులనే అనుమానం కలిగినా వెంటనే 112 నంబరుకు సమాచారమివ్వాలని కోరారు. ఇకపై డ్రైవర్ల వాట్సాప్‌ గ్రూపుల్లో పోలీసులు కూడా ఉంటారని తెలిపారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 05:18 AM