Share News

TTD: స్మార్ట్‌ స్టిక్స్‌.. నైట్‌ గన్స్‌.. పెప్పర్‌ స్ర్పేలు..

ABN , Publish Date - May 28 , 2025 | 05:59 AM

తిరుమల అలిపిరి కాలినడక మార్గాన్ని భక్తుల రక్షణకు మరింత భద్రతతో తీర్చిదిద్దేందుకు టీటీడీ కీలక చర్యలు ప్రారంభించింది. స్మార్ట్‌ స్టిక్స్‌, నైట్‌ గన్స్‌, కెమెరా ట్రాప్స్‌, పెప్పర్‌ స్ప్రేలు వంటి పరికరాలతో పాటు, బాయోఫెన్సింగ్‌, నిఘా పెంపు వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

TTD: స్మార్ట్‌ స్టిక్స్‌.. నైట్‌ గన్స్‌.. పెప్పర్‌  స్ర్పేలు..

చిరుత భయరహితంగా అలిపిరి నడకదారి

అటవీ శాఖతో ఉమ్మడి కార్యాచరణకు టీటీడీ శ్రీకారం

తిరుమల, మే 27(ఆంధ్రజ్యోతి): స్మార్ట్‌ స్టిక్స్‌, నైట్‌ గన్స్‌, పెప్పర్‌ స్ర్పేలు వంటి రక్షణ పరికరాల వినియోగంతో అలిపిరి నడక దారిని చిరుత భయరహిత ప్రాంతంగా మార్చాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి మంగళవారం తిరుమలలోని గోకులం మందిరంలో టీటీడీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈవో శ్యామలరావు వర్చువల్‌గా హాజరవగా.. అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. ఇకపై టీటీడీ అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విజిలెన్స్‌ శాఖలతో అటవీశాఖ సమన్వయం చేసుకుంటూ నిరంతరం జాయింట్‌ డ్రైవ్‌ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. భక్తులకు జంతు బెడద లేకుండా తక్షణం అలిపిరి కాలినడక మార్గంలో భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచనున్నారు. కెమెరా ట్రాప్స్‌, స్మార్ట్‌ స్టిక్స్‌, నైట్‌ గన్స్‌ను వినియోగించాలని నిర్ణయించారు. బయోఫెన్సింగ్‌ ఏర్పాటు సూచనను ఆమోదించారు. నడకదారిలో హైఫ్లాష్‌ టార్చ్‌లతో పాటు పెప్పర్‌ స్ర్పేలను రక్షణపరికరాలుగా వినియోగించాలని నిర్ణయించారు. ఘాట్‌రోడ్డులో ద్విచక్రవాహనాలను ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే అనుమతించాలని నిర్ణయించినట్టు తెలిసింది. నడకదారిలో 12ఏళ్లలోపు పిల్లలను ఉదయం 5నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే అనుమతించాలని భావిస్తున్నట్టు సమాచారం. త్వరలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. అలిపిరి మార్గంలో ఏడోమైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 2.5 కి.మీ. మేర పటిష్ట భద్రత తోపాటు, నిరంతర నిఘా ఉంచాలని నిర్ణయించారు.


ఈ వార్తలు కూడా చదవండి

థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest AP News And Telugu News

Updated Date - May 28 , 2025 | 05:59 AM