Tirumala: శీవారి మెట్టు మార్గంలో చిరుత కలకలం
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:14 AM
తిరుమల 500 మెట్లు వద్ద చిరుత కనిపించటం కారణంగా భక్తుల్లో ఆందోళన పెరిగింది. ఫారెస్ట్ అధికారులు వెంటనే పరిసరాలను పరిశీలించి భక్తులను అప్రమత్తం చేశారు, చిన్నపిల్లలను ఒంటరిగా వదలకూడదని సూచించారు.
తిరుమల, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): తిరుమలకు కాలినడకన వచ్చే శ్రీవారి మెట్టు మార్గంలో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. మార్గంలోని 500 మెట్టు వద్ద ఉన్న పొదల్లో ఓ చిరుత కనిపించినట్టు కొందరు భక్తులు సమీపంలోని భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో ఫారెస్ట్ సిబ్బందితో కలిసి వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే ఆ ప్రదేశంలో చిరుత జాడలేమి కనిపించలేదు. అయినప్పటికీ చిరుత ఉంటే అడవిలోకి వెళ్లిపోయేలా సైరన్లు వేశారు. అలాగే కాలినడక భక్తులను అప్రమత్తం చేసి, తిరుమలకు పంపారు. చిన్నపిల్లలను ఒంటరిగా విడిచిపెట్టవద్దంటూ సూచనలు చేశారు. శనివారం సాయంత్రం కూడా శిలాతోరణానికి సమీపంలోని మూర్తినాయన చెరువు సమీపంలో ఓ చిరుత సంచరించినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. జనసంచారంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
ఇవీ చదవండి:
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి