అగ్ని ప్రమాదంలో మూడు గుడిసెలు దగ్ధం
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:01 AM
ములపాడు మండ లం లింగాల గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూ డు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.

పాములపాడు జనవరి 5 (ఆంధ్రజ్యోతి): పాములపాడు మండ లం లింగాల గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మూ డు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. లింగాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో మాదిగ స్వాములు, నగేష్, నాగన్నల గుడిసెలకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగి ఈ మూడు గుడిసెలు కాలిపోయాయి. కాగా ఆ గుడిసెలకు నిప్పంటుకున్న సమయంలో ఆ ఇళ్లలో పొలం పనుల నిమిత్తం వెళ్లడంతో ఇళ్లలో ఎవరూ లేక పోవడంతో ఆ మంటల్లో ఇంట్లోని సామాన్లు, నిత్యావసర వస్తువులు, అన్ని అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటలను గమనించిన స్థానికులు, రైతులు మంటలను అదుపు చేశారు. దీంతో చుట్టు పక్కల ఉన్న గడ్డివాములకు పెను ప్రమాదం తప్పినట్లయింది. దాదాపు 3 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.