Andhra Pradesh: అవినీతి అధికారులపై వేటు
ABN , Publish Date - Feb 26 , 2025 | 06:13 AM
ముగ్గురు ఉప వాణిజ్య పన్నుల అధికారు(డీసీటీఓ)లు ఇంతియాజ్, మధుసూదన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హిందూపురం సీటీఓ, ముగ్గురు డీసీటీఓల సస్పెన్షన్
అనంతపురం క్రైం, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి అధికారులపై వేటు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సర్కిల్‌లో పనిచేస్తున్న వాణిజ్య పన్నుల అధికారి (సీటీఓ) కృష్ణవేణి, ముగ్గురు ఉప వాణిజ్య పన్నుల అధికారు(డీసీటీఓ)లు ఇంతియాజ్, మధుసూదన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హిందూపురం సర్కిల్ పరిధిలో పట్టుచీరలు, స్ర్కాప్ (తుక్కు), డీజిల్, వక్కలకు సంబంధించి జీరో వ్యాపారం సాగుతున్నా ఈ అధికారులందరూ మామూళ్ల మత్తులో అడ్డుకోలేదనే ఆరోపణలపై విచారణ జరిపి ఈ చర్యలు తీసుకున్నారు.