Share News

ఇద్దరి ఉసురు తీసిన అతివేగం

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:22 AM

ఎన్టీఆర్‌జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని ఎన్‌.ఎస్‌.పీ కెనాల్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... ఉయ్యూరు చెందిన ఫరీద్‌ బేగ్‌ హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన బంధువు మృతి చెందడంతో బైక్‌పై హైదరాబాద్‌ నుంచి సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి ఉయ్యూరుకు ప్రయాణం అయ్యారు. నిద్రమత్తులో అతివేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొన్నారు.

ఇద్దరి ఉసురు తీసిన అతివేగం

-కంచికచర్ల మండలంలో డివైడర్‌ను ఢీకొన్న బైక్‌

-ఇద్దరు యువకులు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

- హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తుండగా ఘటన

- మృతులు హైదరాబాద్‌, కృష్ణాజిల్లా వాసులు

కంచికచర్ల రూరల్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):

ఎన్టీఆర్‌జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని ఎన్‌.ఎస్‌.పీ కెనాల్‌ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... ఉయ్యూరు చెందిన ఫరీద్‌ బేగ్‌ హైదరాబాద్‌లో ఉంటున్నారు. తన బంధువు మృతి చెందడంతో బైక్‌పై హైదరాబాద్‌ నుంచి సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి ఉయ్యూరుకు ప్రయాణం అయ్యారు. నిద్రమత్తులో అతివేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా చింతల్‌మేట్‌కు చెందిన అబ్దుల్‌ ఇమ్రాన్‌ (25), కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రిక గ్రామానికి చెందిన హుస్సేన్‌ కరిముల్లా మృతి చెందారు. ఫరీద్‌ బేగ్‌ తీవ్రంగా గాయపడటంతో అతడ్ని నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వారి కుటుంబాలకు వీరే ఆధారం కావడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - Feb 26 , 2025 | 01:22 AM