గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఏకగ్రీవం
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:44 PM
మండలంలోని పోతుకుంటకు చెందిన శ్రీమ హేశ్వరి గొర్రెల పెంపకందారుల సహకార సం ఘం ఎన్నికలు శనివారం ఆ గ్రామంలోని రైతు సేవాకేంద్రంలో జరిగాయి

ధర్మవరంరూరల్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతుకుంటకు చెందిన శ్రీమ హేశ్వరి గొర్రెల పెంపకందారుల సహకార సం ఘం ఎన్నికలు శనివారం ఆ గ్రామంలోని రైతు సేవాకేంద్రంలో జరిగాయి. ఈ ఎన్నికలలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ రమా దేవి తెలిపారు. అధ్యక్షుడిగా గవ్వల రామాంజి నేయులు, ఉపాధ్యక్షుడిగా చిట్రానారా యణస్వా మి, డైరెక్టర్లుగా ఇస్మాయిల్, నరసింహులు, జీ.నాగప్ప, కొంకా నాగభూషణ, బండిశివయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతన సభ్యులను టీడీపీ మండల కన్వీనర్ పోతు కుంట లక్ష్మన్న, గ్రామాధ్యక్షుడు రాకెట్ల నరసిం హులు, నాయకులు రవి, రమేష్, సన్న, ఐటీడీపీ రాము, నారాయణస్వామి, గవ్వల తిరుమలయ్య సన్మానించారు. అలాగే నడిమిగడ్డపల్లిలో శ్రీలక్ష్మీ గణేష్ గొర్రెల పెంపకందారుల సంఘాన్నీ ఏక గ్రీవంగా ఎన్నుకున్నట్లు జరిగినట్లు ఎన్నికల అధికారి డాక్టర్ స్వర్ణలత తెలిపారు. అధ్యక్షుడిగా పుల్లప్ప, ఉపాధ్యక్షుడిగా పెద్దన్న, డైరెక్టర్లుగా నారాయణస్వామి, విజయ్, కాటమయ్య, మస్తా నప్ప, చెన్నయ్యను ఎన్నుకున్నట్లు తెలిపారు.