సత్తాచాటిన ‘ములకలచెరువు జడ్పీ’
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:17 PM
స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు అన్నింటా విజేతలై నిలిచి సత్తాచాటారు. గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరిగిన మండల స్థాయి వాలీబాల్, ఖోఖో పోటీలు పోటాపోటీగా సాగాయి.
పోటా పోటీగా వాలీబాల్, ఖోఖో పోటీలు
అన్నింటా విజేతలుగా జడ్పీహైస్కూల్ విద్యార్థులు
ములకలచెరువు, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): స్థానిక జడ్పీ హైస్కూల్ విద్యార్థులు అన్నింటా విజేతలై నిలిచి సత్తాచాటారు. గురువారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో జరిగిన మండల స్థాయి వాలీబాల్, ఖోఖో పోటీలు పోటాపోటీగా సాగాయి. అండర్ -14, అండర్ - 17 పోటీల్లో మొత్తం 39 జట్లు పాల్గొన్నాయి. అండర్ - 17 బా లుర విభాగం వాలీబాల్ పోటీల్లో ములకలచెరు వు జడ్పీ హైస్కూల్ విజేతగా, ములకలచెరువు మోడల్ స్కూల్ రన్నర్స్‌గా, బాలికల విభాగంలో బురకాయలకోట గురకుల పాఠశాల విజేతగా, రన్నర్స్‌గా ములకలచెరువు జడ్పీ హైస్కూల్ జట్లు నిలిచాయి. అండర్ - 14 బాలుర విభాగంలో బురకాయలకోట జడ్పీ హైస్కూల్ విన్నర్స్‌గా, రన్నర్స్‌గా సోంపల్లె జడ్పీ హైస్కూల్, బాలికల విభాగంలో బురకాయలకోట గురుకుల పాఠశాల విజేతగా, రన్నర్స్‌గా ములకలచెరువు ఆక్స్‌ఫర్డ్ స్కూల్ నిలిచాయి. అండర్ - 17 ఖోఖోలో ముల కల చెరువు జడ్పీ హైస్కూల్ విజేతగా, రన్నర్స్‌గా దేవళచెరువు జడ్పీ హైస్కూల్, బాలికల విభాగం లో ములకలచెరువు జడ్పీ హైస్కూల్ విజేతగా, రన్నర్స్‌గా ములకలచెరువు మోడల్ స్కూల్ జట్లు నిలిచాయి.

కొత్త మంచూరు హైస్కూల్‌లో క్రీడా పోటీలు ప్రారంభిస్తున్న ఎంపీడీఓ మనోహర్‌రాజు
అండర్ - 14 బాలుర విభాగం ఖోఖో లో విన్నర్స్‌గా ములకలచెరువు జడ్పీ హైస్కూల్ జట్లు, రన్నర్స్‌గా ములకలచెరువు మోడల్ స్కూ ల్, బాలికల విభాగంలో ములకలచెరువు జడ్పీ హైస్కూల్ విన్నర్స్‌గా, రన్నర్స్‌గా దేవళచెరువు జడ్పీ హైస్కూల్ జట్లు నిలిచాయి. ఈ జట్లు డివిజన్ స్థాయి పోటీలకు అర్హత సాధించాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను ఎంఈఓ లు వెంకటరమణ, శంకరప్ప, హెచ్‌ఎం క్రిష్ణారెడ్డి ప్రారంభించారు. పీడీలు అంజప్ప, సరోజమ్మ, శేషారెడ్డి, రేష్మా, ముజాయిద్దీన్, నజీర్, మురళి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
వాల్మీకిపురం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): విద్యా ర్థులు, యువతకు క్రీడల ద్వారా శారీరక, మానసి క ఉల్లాసం పొందవచ్చని ఎంపీడీఓ మనోహర్ రాజు అన్నారు. కొత్తమంచూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంచుకుని రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందన్నారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన గా పలు క్రీడా పోటీలు నిర్వహించారు.
రెండో రోజు శుక్రవారం కూడా మండల స్థాయి పోటీలు జరగనున్నాయి. స్థానిక స్వతంత్ర భారతి పాఠశా ల విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. స్కూల్ గేమ్స్ సెక్రటరీ నాగరాజు, స్కూల్ కమిటీ చైర్మన్ హరినాథ్, హెచ్‌ఎం ప్రకా ష్, ఫిజికల్ డైరెక్టర్ రెడ్డివరప్రసాద్, ఉపాధ్యాయు లు, స్థానిక నేతలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
క్రీడల్లోనూ రాణించాలి
పెద్దమండ్యం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించా లని పెద్దమండ్యం ఎంఈఓ మనోహర్ పిలుపు ని చ్చారు. పెద్దమండ్యం మోడల్ స్కూల్ ప్రాంగ ణలో మండల హైస్కూల్ విద్యార్థులకు గురువా రం అండర్ 14, 17 స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రీడ లు ప్రారంభమయ్యాయి. పెద్దమండ్యం ఎంఈఓ లు మనోహర్, రామకృష్ణ మాట్లాడుతూ క్రీడలు క్రీడా స్ఫూర్తితో ఆడాలన్నారు. అందరూ స్నేహభా వంతో మెలగాలన్నారు. తొలిరోజు క్రీడ పోటీల్లో విద్యార్థులు, విద్యార్థినులకు వేరువేరుగా వాలీబా ల్, ఖోఖో, కబడ్డీ పోటీలు జరిగాయి. ప్రిన్సిపాల్ రామాంజులు నాయక్, క్రీడ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.