Share News

వైభవంగా నలవీర గంగాభవానీ జాతర

ABN , Publish Date - Feb 13 , 2025 | 11:52 PM

మదనపల్లె మండలం, సీటీఎం గ్రామంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారు జాతర గురువారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు.

వైభవంగా నలవీర గంగాభవానీ జాతర
బోనాలు తెస్తున్న ప్రజలు

మదనపల్లె అర్బన, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మదనపల్లె మండలం, సీటీఎం గ్రామంలో వెలసిన నలవీరగంగాభవానీ అమ్మవారు జాతర గురువారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. ఉదయం నుంచి ఆలయంలో గంగమ్మకు ప్రత్యేక అలంకరణలు, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వ హించి భక్తులకు దర్శనం కల్పించారు. సీటీఎం గ్రామంలోని వివిధ పల్లెల నుంచి మహిళలు దీలుభోనాలు ఊరేగింపుగా తరలి వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ జాతర ఆదివా రం వరకు అత్యంతవైభవంగా నిర్వహించడానికి ఆలయక మిటీ సభ్యులు సీటీఎం సర్పంచ సగినాల ఆనందపార్థసారధి, వెలుగుచంద్ర, పారపట్ల సురేంద్రరెడ్డి, పొగాకు వీరప్రతాప్‌లు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తుల కోసం మద నపల్లె ఆర్టీసీ వారు 20 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతు న్నట్లు డీఎం మూరే వెంకటరమణారెడ్డి, అమరనాథ్‌లు తెలి పారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు ఆధ్వర్యంలో తాలుకా సీఐ కళావెంకటరమణ పర్యవేక్షణలో పోలీసులు ప టిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని అనుసరించి ఆలయకమిటీ సభ్యులు మిలటరీ ట్రైనింగ్‌ విద్యార్థులను 30 మంది వలంటీర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Feb 13 , 2025 | 11:52 PM