TG Venkatesh: టీజీవీ కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:17 AM
కర్నూలు నగరంలో కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలత.....
ఒకే సంవత్సరంలో మూడుసార్లు లభించడంపై టీజీ వెంకటేశ్ హర్షం
కర్నూలు కల్చరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో కళలను, కళాకారులను ప్రోత్సహిస్తూ నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరారుతున్న టీజీవీ కళాక్షేత్రానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. ఓకే ఏడాదిలో వరుసగా మూడుసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు కావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ చైర్మన్ చింతపట్ల వెంకటాచారి.. గురువారం కర్నూలులోని టీజీ కార్యాలయంలో టీజీ వెంకటేశ్‌కు రికార్డ్సు పత్రం, మెడల్ అందజేసి సత్కరించారు. ఈ ఘనత వెనుక కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య కృషి ఎంతో ఉందని టీటీ వెంకటేశ్ ఆయన్ను అభినందించారు.