దేవాలయాల పునర్విభజన!
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:36 AM
ఏలూరు జిల్లాలో పలు దేవాలయాల ఆదాయాలు తగ్గిన కారణంగా వాటి స్థాయిని పునర్విభజన చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆదాయం తగ్గడంతో కేటగిరీల మార్పు
దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల జారీ
ఏలూరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో పలు దేవాలయాల ఆదాయాలు తగ్గిన కారణంగా వాటి స్థాయిని పునర్విభజన చేశారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవాలయాల ఆదాయాల ఆధారంగా 6 ఏ,బీసీ కేటగిరుల కింద విభజన ఉంది. రూ.50 లక్షల పైబడి ఆదాయం వచ్చే వాటిని 6ఏగా, రూ.17 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 6 బీ, రూ.15 లక్షలోపు ఆదాయం వచ్చే వాటిని 6సీగా దేవదాయశాఖ చట్టంలో విభజన జరిగింది. ఈ మేరకు దేవాలయాల ఆదాయాల మేరకు వాటికి గ్రేడ్‌లను మార్చారు. ఇటీవలే జిల్లా అధికారులు పంపిన రికార్డులు, ఇతర వివరాల ఆధారంగా గ్రేడ్‌ల పున ర్విభజన జరిగిందని జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సీహెచ్ రంగారావు తెలిపారు. ఇంకా పలు దేవాలయాల గ్రేడ్‌ల విభజన జరగాల్సి ఉందని తెలిపారు.
జిల్లాలో మార్పులు జరిగిన దేవాలయాలు
జూ ఏలూరు గాంధీ ఆంధ్ర జాతీయ విద్యాలయం కెనాల్ రోడ్డులోని సత్రాన్ని 6(ఎ)నుంచి 6 (బీ)2కు మార్చారు.
జూ 6ఏ(2) నుంచి రంగరీజ్ మఠ్ అలియాస్ ఆంజనేయస్వామిగుడి ఏలూరు, ముసునూరు మండలంలో బలివే రామలింగేశ్వరస్వామి ఆలయం, కలిదిండి పటాల భోగేశ్వరస్వామి గుడి, ముదినేపల్లి మండలం కోడూరు లోకేశ్వర, జనార్దనస్వామి గుడులను 6బీకు తగ్గించారు.
జూ 6 బీ(1) పరిధిలోని 84 దేవాలయాలను 6సీ కేటగిరి కింద విభజన చేశారు. భీమడోలు దేవులపల్లి మృత్యుంజయుడు సత్రం, భీమడోలు మండలం పూళ్ల బ్రుదైశ్వత సంప్రదాయ చిదానంద ఆశ్రమం, ఏలూరు గన్‌బజార్ తల్లాటం పట్టయ్య సుబేధార్ సత్రం, కంది అయ్యన్న సత్రం, నంగులూరి వారి సత్రం (పవర్‌పేట), మందమాణిక్యం సత్రం (తూర్పు వీధి), కేసరపల్లి ఆంజనేయ ధర్మశాల (పాతబస్టాండ్), మద్దులవారీ సత్రం (పవర్‌పేట), నూజివీడులోని కొడిమల కొండయ్య శ్రీరామ విలాస్ సత్రం, నూజివీడు రామకృష్ణ పబ్లిక్ ట్రస్ట్) భ్రమరాంబమల్లేశ్వరస్వామి గుడి, ఆంజనేయస్వామి గుడి (గుండుగొలను), సకలేశ్వరస్వామి గుడి (పూళ్ల), వేంకటేశ్వర అండ్ ఆంజనేయస్వామి గుడి (భీమడోలు), వేంకటేశ్వరస్వామి గుడి (గుండుగొలను), రామ లింగేశ్వరస్వామి గుడి (అంబరు పేట), సీతారామస్వామిగుడి (పూళ్ల), వేగిలింగేశ్వరస్వామిగుడి (చింతలపూడి), కాశీవిశ్వేశ్వర స్వామి గుడి (గురుభట్లగూడెం), భోగేశ్వరస్వామిగుడి (పోతునూరు), యోగలింగేశ్వరస్వామి గుడి (జోగన్నపాలెం), సీతారామస్వామిగుడి (సానిగూడెం), రామ మందిరం (తూర్పులాకులు, ఏలూరు), లక్ష్మీగణపతి స్వామి గుడి (సత్రంపాడు), నూకాలమ్మ గుడి (ఏలూరు, కొత్తపేట), కనకదుర్గమ్మ గుడి (పత్తేబాద), కాశీ విశ్వేశ్వరస్వామి గుడి (పవర్‌పేట), సీతారామస్వామి గుడి (దక్షిణపువీధి), కనకదుర్గమ్మగుడి (12 పంపుల సెంటర్), వాసు దేవాలయం (పవర్ పేట), అన్నపూర్ణ సమేత ప్రతాపవిశ్వేశ్వర ఆలయం (అగ్రహారం), జ్వలాపహారేశ్వర స్వామి గుడి (దక్షిణపు వీధి), వేంకటేశ్వరస్వామిగుడి (పడమర వీధి), చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి గుడి (పత్తేబాద) మార్కెండేయ ఓంకార విశ్వేశ్వరస్వామి గుడి (దక్షి ణపు వీధి), జగ దాంబ గుడి (జీలుగు మిల్లి), గాగేశ్వర స్వామి గుడి (తడికలపూడి), సీతారామస్వామిగుడి (కామ వరపుకోట), మందాన గోపాలస్వామిగుడి (కొయ్యలగూడెం), కనకలింగేశ్వరస్వామి గుడి (ఆటపాక), కనకలింగేశ్వరస్వామి (కైకలూరు), వల్లభేశ్వరస్వామిగుడి (వెంకటాపురం, కలిదిండి), రామలింగేశ్వరస్వామి (కైకలూరు) సోమేశ్వరస్వామిగుడి(కోరుకల్లు), రామేశ్వర స్వామిగుడి (కైకలూరు), నాగేశ్వరస్వామిగుడి (ఆశన్నగూడెం)ధర్మలింగేశ్వర స్వామిగుడి (ధర్మాజీగూడెం), మల్లేశ్వరస్వామిగుడి (అండవల్లి), అమృతలింగేశ్వరస్వామి (సింగరాయ పాలెం), వేణుగోపాలస్వామిగుడి (ముదినేపల్లి), మల్లేశ్వరస్వామిగుడి (పెదగొన్నూరు). సర్వేశ్వరస్వామిగుడి (కాకరమిల్లి), కరుణానిధిలక్ష్మీ నర్సిహస్వామిగుడి (నాగన్నమిల్లి), కేశవస్వామిగుడి (చానుమిల్లి)మల్లేశ్వరస్వామిగుడి(అడవికొలను), కోటమహిషాసుర మర్ధినిగుడి (నూజివీడు), వెంకటాచలస్వామిగుడి (నూజివీడు), దుర్గామల్లేశ్వరస్వామిగుడి (నూజివీడు), రాజగోపాలస్వామి గుడి (కలపర్రు), రామాలయం(పెదవేగి), అభయనేయ స్వామిగుడి (వంగూరు), వేంకటేశ్వర, వేణుగోపాల్‌స్వామిగుడి (విజయరాయి), పార్వతీ పరమేశ్వరస్వామిగుడి (పెదవేగి), మందాన గోపాలస్వామి గుడి(ముండూరు), త్రిపురేశ్వర స్వామిగుడి (ముండూరు), భావన్నా రాయణగుడి (పట్టిసం, పోలవరం), సీతారామస్వామి గుడి (పోలవరం), కొండాంద్రమ్మస్వామి గుడి (బొర్రంపాలెం), కాశీ విశ్వేశ్వరస్వామిగుడి (టి.నర్సాపురం), బాలగోపాలస్వామిగుడి (కాగుపాడు), చల్లాలమ్మగుడి(కంసాల గుంట) చేరాయి.