Share News

AP Temple Management: 22 ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Jun 16 , 2025 | 05:27 AM

ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్‌, క్యూలై న్ల మేనేజ్‌మెంట్‌, ఇతర సౌకర్యాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగాదే వదాయశాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక...

AP Temple Management: 22 ఆలయాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

  • ప్రత్యేక అధికారుల నియామకం

  • శానిటేషన్‌, క్యూలైన్ల పర్యవేక్షణ ఇతర బాధ్యతలు

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం శానిటేషన్‌, క్యూలై న్ల మేనేజ్‌మెంట్‌, ఇతర సౌకర్యాల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగాదే వదాయశాఖ పరిధిలోని 22 ఆలయాలను ఎంపిక చేసి ఏడీసీ, ఆర్జేసీ, డీసీ కేడర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. వీటిలో ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, విశాఖ కనకమహాలక్ష్మీ ఆలయం, అరసవిల్లి, ద్వారకాతిరుమల, వాడపల్లి, మోపిదేవి, బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంతోపాటు ఇలా మొత్తం 22 ఆలయాలను అధికారులు ఎంపిక చేశారు. దేవదాయశాఖ అధికారుల నిర్దేశం మేరకు వీరు ఆయా ఆలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. క్యూలైన్ల పర్యవేక్షణ, భక్తులు వేచి ఉండే గదులను పరిశుభ్రంగా ఉంచ డం, ప్రసాదం నాణ్యతపై పర్యవేక్షణ ఇలా అన్ని రకాల భాధ్యతలు చూడాలి. ఆలయాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. ఎక్కడా లోపాలు లేకుండా చూడాలి. ఏవైనా సమస్యలుంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారమివ్వాలి. సమీక్షలు నిర్వహించి, కమిషనర్‌కు నివేదికలు పంపాలి. దేవదాయ శాఖ నిర్దేశించిన ప్రత్యేక నిబంధనలకు అనుగుణంగానే 22 ఆలయాల్లో శానిటేషన్‌, క్యూలైన్ల ఏర్పాట్లు, ప్రసాదం తయారీ, అన్నదానం నాణ్యత ఉండేటట్లు చూడాలి.

Updated Date - Jun 16 , 2025 | 05:27 AM