రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్, డీటీకి గాయాలు
ABN , Publish Date - Feb 13 , 2025 | 11:59 PM
మండ లంలోని కొడప గానిపల్లి గ్రామ పంచాయతీ కార్యా లయం ఎదురుగా ధర్మవరం రహదారిపై గురువారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో కొత్త చెరువు తహసీల్దార్ నీలకంఠారెడ్డి, ధర్మవరం డిప్యూటీ తహసీల్దార్ సురేశ కుమార్ గాయపడ్డారు

కొత్తచెరువు, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మండ లంలోని కొడప గానిపల్లి గ్రామ పంచాయతీ కార్యా లయం ఎదురుగా ధర్మవరం రహదారిపై గురువారం రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో కొత్త చెరువు తహసీల్దార్ నీలకంఠారెడ్డి, ధర్మవరం డిప్యూటీ తహసీల్దార్ సురేశ కుమార్ గాయపడ్డారు. పుట్టప ర్తి నుంచి డిప్యూటి తహసీ ల్దార్ ధర్మవరానికి, ధర్మవరం వైపు నుంచి కొత్తచెరు వుకు తహసీల్దార్ కార్లలో బయలుదేరారు. బస్సును ఓవర్‌టేక్ చేయబోయి.. ఈ రెం డు కార్లు ఎదురుగా ఢీకొన్నాయి. తహసీల్దార్ నీలకంఠారెడ్డి తలకు, డీటీ సురేశకుమార్‌కు గాయాలయ్యాయి. వారిని అనంతపురానికి తరలించారు. తహసీల్దార్, డీటీని ఎమ్మెల్యే పల్లెసింఽధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథ్‌రెడ్డి ఫోనలో పరామర్శించారు.