క్లస్టర్‌సమావేశాలకు 6,700 మంది టీచర్ల హాజరు
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:15 AM
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల స్థానే ప్రభు త్వం కొత్తగా ఏర్పాటు చేసిన క్లస్టర్ల విధానంలో శనివారం తొలిసారిగా నిర్వహించిన ఉపాధ్యా యుల సమావేశాలపై మిశ్రమ స్పందన వ చ్చింది.
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) : స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల స్థానే ప్రభు త్వం కొత్తగా ఏర్పాటు చేసిన క్లస్టర్ల విధానంలో శనివారం తొలిసారిగా నిర్వహించిన ఉపాధ్యా యుల సమావేశాలపై మిశ్రమ స్పందన వ చ్చింది. ఇప్పటివరకు మండలంలోని ప్రాథమి క, ఉన్నత పాఠశాలల టీచర్లకు వేర్వేరుగా రెండురోజులపాటు నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశాలను పునర్వ్యవస్థీకరిస్తూ క్లస్టర్‌కు ట్యాగ్‌చేసిన పాఠశాలల ఉపాధ్యాయులందరినీ ఒకేచోటకు చేర్చి సమావేశాలను నిర్వహించే విధానానికి శ్రీకారం చుట్టారు. శనివారం జరి గిన మొదటి క్లస్టర్ సమావేశానికి జిల్లాలో 111 క్లస్టర్ల మీటింగ్‌లకు మొత్తం 7,127 మంది ఉపాధ్యాయులు హాజరు కావాల్సి ఉండగా 6,700 మంది హాజరయ్యారు. మిగతావారంతా వైద్య సెలవులపై ఉన్నట్టు తెలిసింది. కాగా పలుచోట్ల హాజరు నమోదులో సాంకేతిక సమ స్యలు ఎదురయ్యాయి. మరోవైపు క్లస్టర్ సమా వేశాలు ప్రాథమిక పాఠశాలల టీచర్ల వరకు విజయవంతమైనా, క్లస్టర్ పరిధిలో ఉండే రెండు లేదా మూడు హైస్కూళ్ల టీచర్లకు సబ్జె క్టుల వారీగా నిర్వహించిన సమావేశాలు సబ్జె క్టుకు కేవలం ఇద్దరు, ముగ్గురుతోనే సరిపెట్టా ల్సి రావడంతో కాస్తా డల్‌గా కనిపించాయి. ఈ నేపథ్యంలో హైస్కూళ్ల వరకైనా క్లస్టర్ సమావే శాలను మండలస్థాయిలో నిర్వహిస్తే ఫలవం తంగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమ య్యాయి. తదుపరి క్లస్టర్ సమావేశాలకు మార్చి 17నుంచి ప్రారంభంకానున్న పదోతర గతి పరీక్షల నిర్వహణ, సిబ్బంది నియా మ కాలు వంటివి అడ్డంకిగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మండలంలోని ప్రతీ క్లస్టర్‌కు ఒక సబ్జెక్టు వంతున కేటాయించి మండల స్థాయి లో స్కూల్ అసిస్టెంట్లకు సమావేశాలు నిర్వహి స్తే అర్థవంతంగా ఉండేవని ఏపీ స్కూల్ టీచ ర్స్ అసోసియేషన్ (ఏపీఎస్టీయే) రాష్ట్ర సహాఽ ద్యక్షుడు స్టీవెన్ పేర్కొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు కూడా ముఖ ఆధారిత గుర్తిం పు హాజరు పనిచేయలేదని, ఇక మీదట క్లస్టర్ సమావేశాలను ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకే నిర్వహించాలని డిమాండ్ చేశారు.