Praja Vedika : 25 వరకు టీడీపీ ప్రజావేదిక షెడ్యూల్
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:06 AM
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 17 నుంచి 25 వరకు ప్రజావేదిక కార్యక్రమంలో పలువురు మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొని, ప్రజల నుంచి వినతులు

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 17 నుంచి 25 వరకు ప్రజావేదిక కార్యక్రమంలో పలువురు మంత్రులు, పార్టీ నాయకులు పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. శుక్రవారం, 17వ తేదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు, 18న మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, 20న మంత్రి జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షరీఫ్, పీవీజీ కుమార్, 21న మంత్రి పార్థసారథి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి, 22న మంత్రి అనిత, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, 23న మంత్రి రవికుమార్, చీఫ్ విప్ అనురాధ, 24న మంత్రి సవిత, పల్లా శ్రీనివాసరావు, దేవేంద్రప్ప, 25న మంత్రి బాలవీరాంజనేయస్వామి, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రామారావు హాజరుకానున్నారు.
రేపు ఎన్టీఆర్ 28వ వర్ధంతి
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతిని 18న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాల వద్ద నివాళులర్పించాలని సూచించారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.