Share News

TDP Mahanadu: బాబును అరెస్టు చేసి చేయరాని తప్పు చేశారు

ABN , Publish Date - May 29 , 2025 | 04:28 AM

మహానాడులో కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టి వైసీపీ పాలన దుర్వినియోగాలపై రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌ నేతృత్వంలో టీడీపీ మరో 40 ఏళ్ల పునర్నిర్మాణ యాత్రను ప్రారంభించిందని పేర్కొన్నారు.

TDP Mahanadu: బాబును అరెస్టు చేసి చేయరాని తప్పు చేశారు

దాని ఫలితం అనుభవించారు.. వైసీపీపై రామ్మోహన్‌ ఫైర్‌

మహానాడులో రాజకీయ తీర్మానం.. బలపరచిన షరీఫ్‌, అమరనాథ్‌

మహానాడు రెండో రోజు కీలకమైన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని తొలిసారి కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రతిపాదించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఎన్ని దారుణాలను చేసిందో అందరం చూశామని, జననేత చంద్రబాబును అరెస్టు చేసి వారు చేయరాని తప్పు చేశారని, దాని ఫలితాన్ని కూడా వారు అనుభవించారని అన్నారు. 43ఏళ్ల పార్టీ.. చంద్రబాబు, లోకేశ్‌ నాయకత్వంలో మరో 40ఏళ్ల ప్రయాణానికి సిద్ధమవుతోందన్నారు. ఈ తీర్మానాన్ని ఎం.ఏ షరీఫ్‌, ఎన్‌.అమరనాథ్‌రెడ్డి బలపరిచారు.


రాజకీయ తీర్మానం క్లుప్తంగా ఇదీ..

తెలుగువారి ఆత్మగౌరవం ప్రమాదంలో పడినప్పుడు జాతి అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటడానికి ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 35 వేల కిలోమీటర్లు చైతన్యరథంపై తిరిగి.. పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారం దక్కించుకున్న చరిత్ర ఎన్టీఆర్‌ది, టీడీపీది. ఎన్టీఆర్‌ ఆశయసాధనకు ఆయన అడుగుజాడల్లోనే చంద్రబాబు నడుస్తున్నారు. 2014లో రాష్ట్ర విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధిపథాన నడిపించిన నేత ఆయన. 2024లో మరోసారి ప్రజాభిమానాన్ని దక్కించుకుని.. ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్న పార్టీ టీడీపీ. మనది జాతీయ బావాలున్న ప్రాంతీయ పార్టీ. తెలుగు ప్రజల ప్రయోజనాల కోసమే కాకుండా జాతీయ ప్రయోజనాల కోసం కూడా పనిచేయడం లక్ష్యం. పహల్గాంలో ఉగ్రదాడిని తీవ్రంగాఖండించింది. 2019-24 నడుమ ప్రతిపక్షం బాధ్యతను టీడీపీ సమర్థంగా నిర్వహించింది. ఐదేళ్లలో జగన్‌ అవినీతి, అరాచకాలపై పోరాడింది. వైసీపీ పాలనలో బాధితులుగా నిలిచిన వారికి యువగళం పాదయాత్రతో అండగా నిలిచింది. పార్టీ కేడర్‌లో ధైర్యాన్ని నింపింది. వైసీపీ పాలనలో మన జాతీయ అధ్యక్షుడు గతంలో ఎన్నడూ లేనన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. అక్రమ కేసుల కారణంగా 53 రోజులు జైలు జీవితాన్ని అనుభవించారు. వైసీపీ అరాచకాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లే ఇచ్చి తిరుగులేని శిక్ష విధించారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితమవుతూ టీడీపీ ముందుకు సాగిపోతోంది. లోకేశ్‌ 6 శాసనాల అమలుకు పనిచేస్తూ మంచి ఫలితాలు సాధించడానికి కడప మహానాడు వేదికగా పునరంకితమవ్వాలని పిలుపిస్తున్నాం.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:57 PM