తంబళ్లపల్లెలో టీడీపీ సభ్యత్వ నమోదు భేష్
ABN , Publish Date - Feb 09 , 2025 | 12:00 AM
తంబళ్ళపల్లె నియోజకవ ర్గంలో ఇనచార్జి దాసరి పల్లి జయచంద్రారెడ్డి సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని బాగా చేపట్టి విజయవంతం చేశారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు.
నాయకులతో సమావేశమైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ములకలచెరువు, ఫిబ్ర వరి 8(ఆంధ్రజ్యోతి): తంబళ్ళపల్లె నియోజకవ ర్గంలో ఇనచార్జి దాసరి పల్లి జయచంద్రారెడ్డి సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని బాగా చేపట్టి విజయవంతం చేశారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. మంగళ గిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో శనివారం తంబళ్లపల్లె నియోజకర్గం లోని ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట మండలాలకు చెంది న నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాయకులతో సమావేశమై సభ్యత్వ నమో దు, త్వరలో వేయనున్న కమిటీల గురించి చర్చించారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన కేవీ రమణ, నాయకులు కట్టా సురేంద్రనాయుడు, మూగి రవిచంద్ర, చాంద్‌బా షా, భజంత్రి రామాంజు లు, సంపతికోట కిట్టన్న, చంద్రమోహనరెడ్డి, డేరం గుల నారాయణ, మోహన, ఆనందరెడ్డి, మొటుకు శివ, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.