Gummanuru Narayana: కాంగ్రెస్ నేత హత్య కేసులో..
ABN , Publish Date - May 14 , 2025 | 05:26 AM
కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీనారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. రైలు టెండర్లు, కమీషన్ల వివాదం, భూ వివాదాల నేపథ్యంలో హత్యకు ప్రేరణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే గుమ్మనూరు సోదరుడి అరెస్టు
ఆలూరు, మే 13(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నాయకుడి హత్య కేసులో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 27న జరిగిన ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్మీనారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర ఉందని ఏఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. లక్ష్మీనారాయణకు, గుమ్మనూరు నారాయణకు మధ్య రైల్వే టెండర్లు, కమీషన్ల విషయంలో వివాదాలు ఉన్నాయన్నారు. అలాగే గౌసియా, పెద్దన్న, రాజేశ్‌తో ఉన్న భూ వివాదాల కారణంగా అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరించడంతో లక్ష్మీనారాయణను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. హత్యకు అవసరమైన టిప్పర్ కొనడానికి గుమ్మనూరు నారాయణ ముందు రూ.2లక్షలు, తర్వాత మరో రూ.1.50 లక్షలు ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని నిందితుడు అంగీకరించడంతో అరెస్టు చేసి న్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. కేసు విచారణను పారదర్శకంగా చేస్తున్నామని, అన్ని ఆధారాలు లభించాకే ఏ-15గా చేర్చి అరెస్టు చేశామని స్పష్టం చేశారు. గుమ్మనూరి నారాయణను జూనియర్ సివిల్ కోర్టులో హాజరు పరచగా న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్
CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..