Share News

New APMC Chairmens Appointed: మరో 30 ఏఎంసీలకు చైర్మన్లు

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:53 AM

టీడీపీ అధిష్టానం మరో 30 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్లను నియమించింది. టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి 1 చైర్మన్‌ను ప్రకటించారు.

New APMC Chairmens Appointed: మరో 30 ఏఎంసీలకు చైర్మన్లు

  • టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి 1

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధిష్ఠానం మరో 30 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ(ఏఎంసీ)లకు చైర్మన్లను నియమించింది. బుధవారం విడుదల చేసిన జాబితాలో టీడీపీకి 25, జనసేనకు 4, బీజేపీకి ఒకటి ఇచ్చారు. మొత్తం 218 ఏంఎసీల్లో ఇంకా 103 కమిటీలకు చైర్మన్లను నియమించాల్సి ఉంది. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక ఈ నెలాఖరులో ఈ కమిటీలతో పాటు 21 ప్రధాన దేవాలయాలకు కూడా పాలక మండళ్లను ప్రకటించనున్నారు.

Updated Date - Apr 17 , 2025 | 03:54 AM