TDP: వైసీపీ ప్రభుత్వంలో భూముల్ని ఉద్దేశపూర్వకంగా 22 ఏలో పెట్టారు
ABN , Publish Date - Jan 30 , 2025 | 05:03 AM
బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా జే కొత్తపల్లికి చెందిన కే రెడ్డప్ప విజ్ఞప్తి చేస్తూ...

టీడీపీ గ్రీవెన్స్‌లో బాధితుల ఏకరవు
అమరావతి, జనవరి 29(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో తమ భూముల్ని ఉద్దేశపూర్వకంగా 22 ఏ జాబితాలో చేర్చారని పలువురు టీడీపీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, సీడాప్ చైర్మన్ దీపక్‌రెడ్డి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా జే కొత్తపల్లికి చెందిన కే రెడ్డప్ప విజ్ఞప్తి చేస్తూ... ‘మేం భూమి కొనుగోలు చేసి, రిజిస్ర్టేషన్ చేసుకున్నాం. దానిని 22 ఏలో పెట్టారు. దానిని తీసివేయాలి’ అని కోరారు. నూజివీడులో తమ తండ్రి కొనుగోలు చేసిన భూమిని 22 ఏలో పెట్టారని, దాన్ని తొలగించాలని ఒంగోలుకు చెందిన గోపీకృష్ణ విజ్ఞప్తి చేశారు. వాగు పోరంబోకు అయిన ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వ్యక్తులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విజయనగరం జిల్లా ఆరికతోటకు చెందిన పి.రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం తొలగించిన పింఛన్ పునరుద్ధరించండి అని విజయవాడకు చెందిన దివ్యాంగుడు శ్రీను విజ్ఞప్తి చేశారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం..
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
For AndhraPradesh News And Telugu News