ముదిగుబ్బ ఎంపీపీపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:46 PM
ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్‌ను బుధవారం కోరినట్లు గిరిజన సంఘం నాయకులు తెలిపారు.

ఓబుళదేవరచెరువు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్‌ను బుధవారం కోరినట్లు గిరిజన సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని ఆయన కార్యాలయంలో మంత్రికి వినతిపత్రం అందించినట్లు చెప్పారు. ఎంపీపీ భూ అక్రమాలపై సిట్‌తో దర్యాప్తు చేయించాలని కోరినట్లు తెలిపారు. (మంత్రి స్పందిస్తూ.. సమగ్ర దర్యాప్తు చేయించి.. గిరిజనులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన అధ్యక్షుడు అక్కులప్పనాయక్, నాయకులు శ్రీనివాసనాయక్, విష్ణునాయక్, రవినాయక్, వెంకటే్‌షనాయక్, చిన్నమస్తాన ఉన్నారు.