Taiwan : ఎలకా్ట్రనిక్స్‌లో పెట్టుబడులకు తైవాన్ సంసిద్ధత
ABN , Publish Date - Feb 14 , 2025 | 06:22 AM
ఎలకా్ట్రనిక్స్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్న తైవాన్.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉండవల్లిలోని నివాసంలో గురువారం మానవ వనరులు, ఆర్టీజీఎస్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో తైపీ ఎకనామిక్ అండ్

మంత్రి లోకేశ్‌తో ఆ దేశ బృందం భేటీ
ఫుట్‌వేర్, టెక్స్‌టైల్ రంగాల్లోనూ ఆసక్తి
లక్షలాది యువతకు ఉద్యోగాలు వస్తాయని లోకేశ్ ఆశాభావం
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఎలకా్ట్రనిక్స్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్న తైవాన్.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఉండవల్లిలోని నివాసంలో గురువారం మానవ వనరులు, ఆర్టీజీఎస్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్, చెన్నై డైరెక్టర్ జనరల్ రిచర్డ్ చెన్, నెగ్జుసిండో కన్సల్టెన్సీ ఎండీ ఎరిక్ చాంగ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎలకా్ట్రనిక్స్, ఫుట్‌వేర్, టెక్స్‌టైల్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకరించాలని ఈ సందర్భంగా లోకేశ్ కోరారు. వారి సహకారం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగిస్తుందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు. తైవాన్ పారిశ్రామిక సంస్థలు విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నందున ఆంధ్రప్రదేశ్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని ఇక్కడ వ్యాపారాన్ని కొనసాగించాలని లోకేశ్ కోరారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్, ఫుట్‌వేర్ పార్కుల ఏర్పాటులో ఆదేశ కంపెనీలతో భాగస్వామ్యం కావడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉందని తెలిపారు.