Share News

స్వామి వివేకానంద యువతకు ఆదర్శం

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:42 PM

స్వామీ వివేకానంద యువతకు ఆదర్శమని స్థానిక ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.

స్వామి వివేకానంద యువతకు ఆదర్శం
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే తదితరులు

మదనపల్లె అర్బన, జనవరి 12(ఆంధ్రజ్యోతి): స్వామీ వివేకానంద యువతకు ఆదర్శమని స్థానిక ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతిని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివా రం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామీ వివేకానంద విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు, సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామీ వివేకా నంద. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు షంఫీర్‌, శివన్న, బిల్లేరెడ్డిప్రసాద్‌, నియోజకవర్గ బీసీసెల్‌ అధ్యక్షుడు ఎం. నాగయ్య, 30వార్డు ఇనచార్జి దుబ్బిగాళ్ల భాస్కర్‌, డాన్స రెడ్డెన్న, మల్లికార్జున నాయుడు, గుత్తికొండ త్యాగరాజ, కోన భాస్కర, వాల్మీకి సంఘం నాయకులు పలిశ్రీనివాసులు, జయ, ఆదెన్న, తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో పలుచోట్ల స్వామీ వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజే పీ నాయకులు సొసైటీ కాలనీలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే హెల్పింగ్‌మైండ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అబుబాకర్‌ సిద్ధిక్‌ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా ఆస్పత్రిలోని స్వామీ వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక జడ్పీ హైస్కూల్‌లోని వివేకానంద విగ్రహానికి యూటీఎప్‌ జిల్లా, డివిజన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యూటీఎప్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు సుధాకర్‌ నాయుడు, చిత్తూరు జిల్లా అఽధ్యక్షుడు సోమశేఖర్‌నాయుడు, జిల్లా కార్యదర్శి పురం వెంకటరమణ, నాయకులు, బీజేపీ నాయకులు బండిఆనంద్‌, జబ్బల శ్రీనివాసులు, ఎల్లంపల్లె ప్రశాంత, బర్నేపల్లె రవికుమార్‌, జేకే వర్మ, బాలాజీ, వరదారెడ్డినారఽథరెడ్డి, విజయభారతి సేతు, ఏబీసీ భాస్కరాచారి, రిటైర్డ్‌ టీచర్‌ రెడ్డెప్ప, ఎమ్మార్పీస్‌ నరేంద్ర, వివేకానంద ఆశయ ఫౌండేషన భాను, హెల్పింగ్‌ మైండ్స్‌ సభ్యులు పాల్గొన్నారు.

పీలేరులో: స్వామి వివేకానంద 162వ జయంతిని ఆదివారం పీలేరులోని పలు సం ఘాలు ఘనంగా నిర్వ హించాయి. స్థానిక కో టపల్లె క్రాస్‌లోని ఆ యన విగ్రహానికి పూ లమాలలు అర్పించి ఘ నంగా నివాళులర్పించా యి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద కోరుకున్నట్లు యువత దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. స్థానిక వాసవీ క్లబ్‌ గ్రేటర్‌, వాసవీ కపుల్స్‌ క్లబ్‌ సభ్యులు సంయుక్తంగా స్వామి వివేకానందకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ ఉపాధ్యాయ సంఘం నాయకులు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు అర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీ కంభం నరసింహారెడ్డి, టీడీపీ బీసీ సెల్‌ నాయకులు పోలిశెట్టి సురేంద్ర, వీ211ఏ వాసవీ క్లబ్‌ సభ్యులు జూటూరు అరవింద్‌, పామిడి జయచంద్ర, తులసీకృష్ణ, సకల హరి, కేసర్ల భరత, అమరా సత్యనారాయణ, శివఫణేష్‌, గోవర్దన ప్రసాద్‌, అనిల్‌ కుమార్‌, శంకర్‌నాథ్‌, విజయ మహేశ, నవీన, ఆంధ్రప్రదేశ ఉపాధ్యాయ సంఘం సభ్యులు దివాకర్‌, గోవర్దన ప్రసాద్‌, శివశంకర్‌, రమణయ్య, శంకర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఆదివారం జనవి జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించా రు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవికుమార్‌, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ప్రభుచరణ్‌, డాక్టర్‌ సోని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 11:42 PM