Share News

Supreme Court lawyers: క్షేత్రస్థాయి పర్యటనలో సుప్రీం న్యాయవాదులు

ABN , Publish Date - May 29 , 2025 | 05:37 AM

కృష్ణా ట్రైబ్యునల్‌లో వాదనలు సమర్థంగా చేయడానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు జైదీప్ గుప్తా, ఉమాపతి బాపట్ల జిల్లెళ్లమూడి గ్రామంలోని నల్లమడ వాగు, బకింగ్‌హామ్ కాలువ తీరులను పరిశీలించారు.

Supreme Court lawyers: క్షేత్రస్థాయి పర్యటనలో సుప్రీం న్యాయవాదులు

బాపట్ల, మే 28(ఆంధ్రజ్యోతి): కృష్ణా ట్రైబ్యునల్‌లో రాష్ట్రం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టారు. ఏపీ తరఫున ట్రైబ్యునల్‌లో వాదనలను సమర్థవంతంగా వినిపించాలంటే క్షేత్రస్థాయి అవగాహన అవసరమని లాయర్లు భావించారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాదులు జైదీప్‌ గుప్తా, ఉమాపతి బుధవారం బాపట్ల జిల్లాలోని జిల్లెళ్లమూడి గ్రామంలో ఉన్న నల్లమడ వాగును, బకింగ్‌హాం కాలువ తీరుతెన్నులనూ పరిశీలించారు. ఈ బృందం వెంట ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ డెరెక్టర్‌ పీవీ సత్యనారాయణతో పాటు సీనియర్‌ సైంటిస్ట్‌ ఏ సాంబయ్య ఉన్నారు


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:59 PM