Kolleru Lake : సుప్రీం విచారణ మార్చి 19కి వాయిదా
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:57 AM
కొల్లేరు సరస్సు ఆక్రమణలపై విచారణను సుప్రీంకోర్టు మార్చి 19కి వాయిదా వేసింది. కొల్లేరు సరిహద్దుల వ్యవహారంపై గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ వినోద్

న్యూఢిల్లీ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కొల్లేరు సరస్సు ఆక్రమణలపై విచారణను సుప్రీంకోర్టు మార్చి 19కి వాయిదా వేసింది. కొల్లేరు సరిహద్దుల వ్యవహారంపై గురువారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా గత ఏడాది డిసెంబరులో విచారణ తర్వాత చేపట్టిన కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. మూడు నెలల్లో కొల్లేరు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని నివేదించింది. వచ్చే మూడు నెలల్లో కొల్లేరు సరిహద్దులను ఖరారు చేయనున్నట్లు కోర్టుకు తెలిపింది. గతేడాది అక్టోబరు నుంచి ఇప్పటి వరకు సుమారు 5 వేల ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్లు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. ప్రభుత్వ అఫిడవిట్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. మార్చి 19 లోపు మిగిలిన వివరాలతో తదుపరి నివేదికదాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.