AP Advocate Association: హైకోర్టు ప్రతిష్ఠనుఉన్నతశిఖరాలకు తీసుకెళ్లాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:57 AM
. రాష్ట్ర హైకోర్టులో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ, గ్రంథాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. మాజీ అడ్వొకేట్ జనరల్.. తలారి అనంతబాబు జ్ఞాపకార్థం

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీ భట్టి
హైకోర్టులో ఈ- లైబ్రరీ, గ్రంథాలయం ప్రారంభం
అమరావతి, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు ప్రతిష్ఠను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీ భట్టి కోరారు. రాష్ట్ర హైకోర్టులో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ, గ్రంథాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. మాజీ అడ్వొకేట్ జనరల్.. తలారి అనంతబాబు జ్ఞాపకార్థం ఆయన కుటుంబసభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ-లైబ్రరీ ప్రారంభానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సంద్భంగాగ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏపీ హైకోర్టు అడ్వొకేట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఎస్వీ భట్టి మాట్లాడుతూ.. మాజీ ఏజీ అనంతబాబుతో తనకు 13 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన వారసత్వాన్ని కుటుంబ సభ్యులను కొనసాగిస్తున్నారని, ఈ లైబ్ర రీ ఏర్పాటుకు సహకారం అందించడం ద్వారా న్యాయసమాజం పట్లవారికి ఉన్న గౌరవం, ఆప్యాయతను తెలియజేస్తుందని కొనియాడారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ... ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులకు గుర్తుగా పిల్లలు లక్షలు ఖర్చుపెట్టడం చాలా అరుదు అంటూ అనంతబాబు కుటుంబ సభ్యులను అభినందించారు. న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావు మాజీ ఏజీ అనంతబాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో అనంతబాబు కుమారులు వెంకటగోపాలరావు, గోవిందరాజులు, కుటుంబ సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ ఏజీ సాంబశివ ప్రతాప్, పీపీ మెండ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ధనంజయ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.చిదంబరం, ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, కార్యదర్శి శ్రీహరి, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.చిదంబరం ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు జస్టిస్ ఎస్వీ భట్టిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందేజేశారు.