Share News

MLA Naseer Ahmed: సూపర్‌ సిక్స్‌ అమలుతో వైసీపీ నేతల్లో వణుకు

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:07 AM

సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘

MLA Naseer Ahmed: సూపర్‌ సిక్స్‌ అమలుతో వైసీపీ నేతల్లో వణుకు

  • సంక్షేమానికి టీడీపీ మారుపేరు: ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘తల్లికి వందనం పథకంతో ప్రతి ఇంట్లో నేడు సంబరాలు చేసుకుంటున్నారు. నాడు జగన్‌ ఒక్క పిల్లాడినే చదివించుకోండని అంటే నేడు చంద్రబాబు పిల్లలందరినీ చదివించుకోండని అంటున్నారు. జగన్‌ ఐదేళ్లలో అమ్మ ఒడికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తే మేం ఏడాదికే రూ.10,091 కోట్లు ఖర్చు చేస్తున్నాం. జగన్‌ రెడ్డి సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. భవిష్యత్తులో పేదరికం లేని సమాజ నిర్మాణానికి నేడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ఉపయోగపడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే సూపర్‌ సిక్స్‌ పథకాలన్నీ అమలు చేయడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది’ అని నసీర్‌ అన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 04:08 AM