Kalava Srinivasulu: అంచనాలకు మించి మంచి..
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:05 AM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అంచనాలకు మించి ప్రజలకు మంచి చేసింది..
అందుకే ‘సూపర్ సిక్స్.. సూపర్ హిట్’ సభ
అనంత వేదికగా 10న నిర్వహణ: విప్ కాలవ శ్రీనివాసులు
అనంతపురం క్రైం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే అంచనాలకు మించి ప్రజలకు మంచి చేసింది. అందుకే సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ నిర్వహించబోతున్నాం’ అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఈ నెల 10న అనంతపురంలో జరిగే సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ కోసం నగర శివారులోని జీఎంఆర్ ఇంద్రప్రస్థ సభాస్థలిలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలవ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు సమష్ఠిగా ఈ సభను విజయవంతం చేస్తామని అన్నారు.