YSRCP: అవినాశ్‌రెడ్డి అనుచరులతో ప్రాణహాని
ABN , Publish Date - Jun 22 , 2025 | 03:31 AM
కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుచరులు తనను వెంబడించారని, వారితో ప్రాణహాని ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2 నిందితుడైన సునీల్‌యాదవ్ పోలీసులను ఆశ్రయించారు
పోలీసులకు సునీల్‌యాదవ్ ఫిర్యాదు
పులివెందుల, జూన్ 21(ఆంధ్రజ్యోతి): కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అనుచరులు తనను వెంబడించారని, వారితో ప్రాణహాని ఉందని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2 నిందితుడైన సునీల్‌యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. శనివా రం రాత్రి పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం తన పెళ్లి రోజు కావడంతో సునీల్‌యాదవ్ సాయంత్రం 6 గంటల సమయంలో భాకరాపురంలోని ఇంటి నుంచి కుటుంబసభ్యులతో కలిసి రింగురోడ్డులో ఉన్న గుడికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అవినాశ్‌రెడ్డి అనుచరులు లోకేశ్వర్‌రెడ్డి, పవన్‌కుమార్ (వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్)తో పాటు మరో ఇద్దరు వాహనంలో వెంబడించారు. దీందీ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు.