Daggubati Purandeswari: రాష్ట్ర వ్యాప్తంగా దళిత సమ్మేళనాలు పురందేశ్వరి
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:18 AM
దేశాభివృద్ధి, అందరి సంక్షేమమే ప్రధాని మోదీ ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
అమరావతి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధి, అందరి సంక్షేమమే ప్రధాని మోదీ ధ్యేయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యానించారు. దళిత సమ్మేళనాలు నిర్వహించి ఆయా వర్గాలకు మోదీ ప్రభుత్వం చేసిన మేలు వివరించనున్నట్లు తెలిపారు. పదకొండేళ్లుగా ‘సబ్ కా సాథ్’ పాలన అందిస్తున్నారని కొనియాడారు. విజయవాడలో ఆదివారం ఎస్సీ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశం గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పురందేశ్వరితోపాటు ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ భోలా సింగ్ పాల్గొన్నారు.