Rural Development : మరో 3.5 కోట్ల ఉపాధి పనిదినాలు కల్పించండి
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:52 AM
కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన ఉపాధి పనిదినాలు పూర్తి కావొస్తుండటంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు పనిదినాలు కోసం ప్రతిపాదనలు పంపింది. 2024-25 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 21.50 కోట్ల పనిదినాలను మన రాష్ట్రానికి కేటాయించింది.

కేంద్రానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ ప్రతిపాదనలు
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన ఉపాధి పనిదినాలు పూర్తి కావొస్తుండటంతో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు పనిదినాలు కోసం ప్రతిపాదనలు పంపింది. 2024-25 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 21.50 కోట్ల పనిదినాలను మన రాష్ట్రానికి కేటాయించింది. వాటిలో ఇప్పటికే 20.45 కోట్ల పనిదినాలను కల్పిస్తూ పనులు చేపట్టడంతో ఇక 1.55 కోట్ల పనిదినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి నెలాఖరు వరకు కూలీలకు పనులు కల్పించాలంటే అదనపు పనిదినాలు అవసరమవుతాయి. ఏటా మన రాష్ట్రానికి 25 కోట్ల పనిదినాలతో లేబర్ బడ్జెట్ కేటాయిస్తారు. ఇప్పటికే 21.50 కోట్లు పనిదినాలు కల్పించినందున మిగిలిన 3.50 కోట్ల పనిదినాలు కూడా కల్పించాలని గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకు ప్రతిపాదనలు పంపారు.