Share News

Andhra industries: పారిశ్రామిక హబ్‌గా ఏపీ

ABN , Publish Date - Jun 02 , 2025 | 06:09 AM

రాష్ట్రం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి టీజీ భరత్‌ తెలిపారు. కాపుల అభివృద్ధికి కర్నూలులో రూ.1 కోటి విలువైన కాపు భవన్‌ నిర్మాణానికి హామీ ఇచ్చారు.

Andhra industries: పారిశ్రామిక హబ్‌గా ఏపీ

కర్నూలులో కాపు భవన్‌ నిర్మాణానికి రూ. కోటి

కర్నూలు కల్చరల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక హబ్‌గా రాష్ట్రం శరవేగంగా దూసుకుపోతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలో కాపు భవన్‌ నిర్మాణానికి రూ.కోటి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం బలిజ సంఘం ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పది, ఇంటర్‌లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈసందర్భంగా టీజీ భరత్‌ మాట్లాడుతూ బీసీలు, మైనార్టీలతో పాటు కాపుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెనక్కు వెళ్లిపోయాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనతి కాలంలోనే అనేక పరిశ్రమలు తీసుకువచ్చామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు తన వద్దే పరిశ్రమల శాఖను ఉంచుకుని స్వయంగా పర్యవేక్షించారని, అలాంటి కీలక శాఖను తనపై నమ్మకంతో ఇచ్చారని, సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మంత్రి టీజీ భరత్‌ను బలిజ(కాపు) సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు ఆర్జా రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు గాండ్ల లక్ష్మన్న, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇవీ చదవండి:

చర్చలంటూ జరిగితే పీఓకే పైనే

పక్కా ప్లాన్ ప్రకారమే హత్యలు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 06:09 AM