Housing Scheme: ఐదేళ్లలో పేదలందరికీ పక్కా ఇళ్లు
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:53 AM
అర్హులైన పేదలందరికీ ఐదేళ్లలో నాణ్యమైన పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన పక్కా గృహాలు నిర్మించి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. రాష్ట్రంలో పీఎంఏవై పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ పుురోగతిపై బుధవారం విజయవాడలోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉపకరణాలను ఉచితంగానే అందించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. సమీక్షలో మల్టీ స్టేక్ హోల్డర్ హ్యాబిటేట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా డైరెక్టర్లు ఆనంద్ బొలిమేరా, జెబాకుమార్, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ శివప్రసాద్, హౌసింగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..