అక్రమాలకు స్టాంప్..!
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:48 PM
బేతంచెర్ల సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో అక్రమాలు జరిగిపోతున్నాయి. నిషేధిత భూములు సైతం రిజిస్ట్రేషన అయిపోతున్నాయి.

తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లు
స్టాంప్ వెండర్‌పై ఆరోపణలు
బేతంచెర్ల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): బేతంచెర్ల సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో అక్రమాలు జరిగిపోతున్నాయి. నిషేధిత భూములు సైతం రిజిస్ట్రేషన అయిపోతున్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అక్రమాలు జరిగిపోతున్నాయి. డబ్బు ముడితే చాలు నిషేధిత జాబితాలో ఉన్నా సరే రిజిస్ట్రేషన చేసేస్తున్నారు. ఇందులో ఓ స్టాంప్ వెండర్ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మండలంలోని గూటుపల్లెకు చెందిన కుర్ని పకీరయ్య హంపమ్మ అనే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు సంతానం. ఆ మేరకు రెవెన్యూ అధికారులు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ కాదని ఇక్కడ ఉండే ఓ స్టాంప్ వెండర్ తప్పుడు సర్టిఫికెట్ తయారు చేసి ఇచ్చాడు. ఆ మేరకు కుర్ని పెద్దరాజు, బండ కొండయ్యలు మాత్రమే కుమారులు అని అందులో చూపించాడు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా వీరి భూమిని కొనగంటి బూసిరెడ్డి కుమారుడు నారాయణరెడ్డికి రిజిస్ర్టేషన చేయించి ఇచ్చాడు. (దస్తావేజు నెంబరు 5026/2024) ఇందుకు ఇందుకు రూ.5 లక్షలు వసూలు చేశాడని సమాచారం. అలాగే పట్టణంలోని రోటరీ క్లబ్ వెనుక ఉన్న రీడ్ కళాశాల స్థలాన్ని కూడా తప్పుడు రిజిస్ర్టేషన చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా ప్రభుత్వ, వక్ఫ్ భూములను సైతం రిజిస్ట్రేషన చేయిస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ-స్టాంపుల అమ్మకాల్లోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. రూ.50, రూ.100 స్టాంపులపై అదనంగా రూ.50 వసూలు చేస్తున్నాడని జనాలు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు సదరు స్టాంప్ వెండర్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఫ సబ్ రిజిస్ర్టార్ వనితలక్ష్మి వివరణ
ఈ ఏడాది జూలైలో ఓ వెండర్ కుటుంబ సభ్యుల పేర్లు తయారు చేసి రిజిసే్ట్రషనలో అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇంతకు ముందు ఏమి జరిగిందో నాకు తెలియదు. ఈ ఘటనపై లోతుగా విచారణ జరుపుతాం.