SSD Token : 20న ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:47 AM
వైకుంఠ ద్వార స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల జారీపై టీటీడీ ఈవో శ్యామలరావు గురువారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్న క్రమంలో

వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలు కూడా
తిరుమల, (ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల జారీపై టీటీడీ ఈవో శ్యామలరావు గురువారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. 19వ తేదీతో వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్న క్రమంలో 20వ తేదీకి సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ల జారీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌కు చేరుకుని శ్రీవారిని దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 20న ప్రొటోకాల్ మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను, శ్రీవాణి దర్శనాలను కూడా రద్దు చేశారు.