Share News

SS Thaman : నిరంతర అధ్యయనంతోనే లక్ష్య సాధన

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:52 AM

నిరంతర అధ్యయనంతోనే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని సినీ సంగీత దర్శకుడు, గాయకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ అన్నారు. గుంటూరు సమీపంలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ(వడ్లమూడి)లో జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు

SS Thaman : నిరంతర అధ్యయనంతోనే లక్ష్య సాధన

విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌లో సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌

గుంటూరు విద్య, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): నిరంతర అధ్యయనంతోనే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుందని సినీ సంగీత దర్శకుడు, గాయకుడు ఎస్‌ఎస్‌ తమన్‌ అన్నారు. గుంటూరు సమీపంలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ(వడ్లమూడి)లో జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవం గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తమన్‌ మాట్లాడుతూ జీవితంలో కొత్తవి నేర్చుకోవడానికి ఆలస్యం చేయరాదని విద్యార్థులకు సూచించారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఏదో ఒకటి సాధించేలా ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. జీవితంలోని ప్రతి దశను, ప్రతి నిమిషాన్ని ఆస్వాదించి విజయతీరాలకు చేరాలన్నారు. చదువుకే పరిమితం కాకుండా యోగ, సంగీతం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు సామాజిక ేసవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఇండియన్‌ వాలీబాల్‌ మాజీ క్రీడాకారుడు మన్యం తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శారీరక దృఢత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసికంగా మరింత బలంగా ఉంటారన్నారు. విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌లో 80 ఈవెంట్లను నిర్వహించినట్టు వీసీ నాగభూషణ్‌ తెలిపారు. రిజిస్ట్రార్‌ రఘునాథన్‌, సీఈవో మేఘన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 03:52 AM