Srinivasa Rao: రాష్ట్ర ఆర్యవైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:01 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు నియమితులయ్యారు.
నూతన కమిటీ నియామకం
ముషీరాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసరావు నియమితులయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్య వైశ్య భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐ.వి.ఎఫ్) నూతన కమిటీ ఏర్పాటైంది. అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారికి నియామకపత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐ.వి.ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనివాసరావు, రామ్మోహనరావు, కోశాధికారిగా సుబ్బారాయిలు, యువజన సంఘం అధ్యక్షుడిగా అభినయ్, యువజన విభాగం వర్కింగ్ ప్రసిడెంట్‌గా శివకుమార్, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా నాగసుప్రజ, చీఫ్ కోఆర్డినేటర్‌గా అజయ్ చంద్ర, కోఆర్డినేటర్‌గా సూర్యప్రకాష్, యువజన విభాగం కోశాధికారిగా రవిచంద్ర నియమితులయ్యారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారిని శ్రీనివాస్ గుప్తా, అంతర్జాతీయ ఐ.వి.ఎఫ్ సలహాదారులు గంజి రాజమౌళి గుప్తా సన్మానించారు.