Share News

జీరోసైన్స్‌ ల్యాబ్‌ను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:19 AM

జీరో సైన్స్‌ ల్యాబ్‌ను ప్రయోగాత్మకంగా శ్రీకాకు ళం జిల్లాలోనే తొలిసారిగా ప్రారంభిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

జీరోసైన్స్‌ ల్యాబ్‌ను విజయవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గొండు శంకర్‌

  • శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌

అరసవల్లి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జీరో సైన్స్‌ ల్యాబ్‌ను ప్రయోగాత్మకంగా శ్రీకాకు ళం జిల్లాలోనే తొలిసారిగా ప్రారంభిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయన డీఈవో తిరుమల చైతన్యతో కలిసి జీరో సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులకు తరగతి గదిలో అత్యంత ఆకర్షణీయంగా, లైవ్‌ చిత్రాలతో బోధన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలోని 20 పాఠశాలల్లో ప్రారంభిస్తున్నామ ని, ఈ పద్ధతిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు బోధన అందించను న్నట్టు తెలిపారు. ఇందుకోసం 60మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ కేటాయించింద న్నారు. బోధనకు ఎంపికైన 60 మంది ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 26 , 2025 | 12:19 AM