Share News

వైసీపీ పాలన అవినీతిమయం: ఎమ్మెల్యే అశోక్‌

ABN , Publish Date - Jul 26 , 2025 | 11:28 PM

వైసీపీ పాలన అంతా అవినీతి మయమేనని, ఇసుక నుంచి మద్యం వరకు దోచుకున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు.

వైసీపీ పాలన అవినీతిమయం: ఎమ్మెల్యే అశోక్‌
సోంపేట: కరపత్రాలిచ్చి అవగాహన కలిగిస్తున్న ఎమ్మెల్యే అశోక్‌

సోంపేట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలన అంతా అవినీతి మయమేనని, ఇసుక నుంచి మద్యం వరకు దోచుకున్నారని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ అన్నారు. లక్కవరంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రజలకు సంక్షేమ పాలనను ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్ర మంలో టీడీపీ మండల అధ్యక్షుడు సూరాడ చంద్రమోహన్‌, రాష్ట్రకార్య దర్శి మడ్డు కుమార్‌, నాయకులు చిత్రాడ శ్రీనివాసరావు, జీకే నాయుడు, సనపల శ్రీరాంమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే శంకర్‌

గార రూరల్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు ప్రతి పల్లె అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మె ల్యే గొండు శంకర్‌ అన్నారు. గొంటి, బలరాంపురం గ్రామాల్లో ‘సుపరి పాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇంటిం టికీ వెళ్లి కరపత్రాలను అందించి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివ రించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వన్య ప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీలో ‘గొండు’

శ్రీకాకుళం, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చట్టసభ లకు పలు కమిటీలను నియ మించింది. ఇందులో భాగంగా వన్య ప్రా ణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి చైర్మన్‌గా స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యవహరిస్తారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, కురుగొండ్ల రామకృష్ణ, గొండు శంకర్‌, చింతమనేని ప్రభాకర్‌, నందమూరి బాలకృష్ణ, పులిపర్తి వెంకటమణిప్రసాద్‌, బుడ్డా రాజశేఖరరెడ్డి, వేగేశన నరేంద్రవర్మ రాజు, ఎమ్మెల్సీలు చిన్న గోవిందరెడ్డి దేవసాని, బి.తిరుమలనాయుడు, పాల వలస విక్రాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Jul 26 , 2025 | 11:28 PM