తల్లికి వందనంపై వైసీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారు
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:22 PM
రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు విజయవంతం కావడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు
పాతపట్నం, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు విజయవంతం కావడంతో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకున్నారని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎం తో ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఈ పథ కం ద్వారా ఒకేరోజు పదివేల కోట్లకు పైగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం రికార్డు అని అన్నారు. ఎన్ని కలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎంతమంది చదువుకుంటే అంత మంది పిల్లలకు తల్లికి వందనం పేరి ట డబ్బులు జమచేసి పిల్లల చదువుకు ఆస రాగా నిలిచారన్నారు. సమావేశంలో పలు వురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధిం చాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అ న్నారు. మంగళవారం ఆల్‌ఆంధ్రా రోడ్డు మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు, ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.
‘తల్లికి వందనం’పై వైసీపీ తప్పుడు ప్రచారం
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ కార్య క్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసిందని, అయితే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నా రని, ఇది తగదని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పథకంపై వైసీపీ దిగజా రుడు ఆరో పణలు చేస్తోందని, తల్లికి గౌర వం ఇవ్వలేని మాజీ సీఎం నేడు ఈ కార్య క్రమంపై అవా స్తవాలు పేర్కొనడం సిగ్గుచేట న్నారు. వైసీపీ పాలనలో ఇంటిలో ఒకరికి మాత్రమే రూ.13 వేలు ఇచ్చారని, మిగిలిన రూ.2 వేలు అప్ప టి సీఎం జగన్ ఖాతాలోకి వెళ్లిపోయాయా అని ప్ర శ్నించారు. జగన్ పాల నలో కేవలం 42 వేల మందికి అమ్మఒడి పడితే తల్లికి వందనం కింద 67.27 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలో తల్లుల ముఖా ల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయని, దీనిని చూసి ఓర్వలేక ఆ పార్టీ మూకలు తప్పుడు ప్రచారా లు మొదలె ట్టారని విమర్శించారు. అనాథలైన పిల్లలకు కూడా కలెక్టర్లు నిర్థా రించిన తరువాత పథకం అమలు చేస్తా మని, పారదర్శకత కోసం సంబంధిత సచివా లయాల్లో లిస్టులను ప్రదర్శనకు పెట్ట డం జరుగుతుందన్నారు.