Share News

ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:57 PM

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు అన్నారు.

ఎమ్మెల్యే రవికుమార్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర
మాట్లాడుతున్న కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కృష్ణంనాయుడు తదితరులు

- రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కృష్ణంనాయుడు

నరసన్నపేట, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని రాష్ట్ర కాళింగ కార్పొరేషన్‌ చైర్మన్‌ రోణంకి కృష్ణంనాయుడు అన్నారు. మంగళవారం స్థానిక గాంధీనగర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకుల డైరెక్షన్‌లో పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌ సౌమ్య సరికొత్త డ్రామాకు తెరతీశారన్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా అధికారులు సౌమ్యను బదిలీ చేశారని, దీన్ని ఆమె మనసులో పెట్టుకొని రవికుమార్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. దీన్ని తామంతా ఖండిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాళింగ సంక్షేమ సంఘ నాయకులు దువ్వాడ జీవితేశ్వరరావు, జల్లు చంద్రమౌళి, కరుకోల రమేష్‌బాబు, ఉప్పాడ పూర్ణారావు, సీపాన త్రినాథరావు, కిల్లి లక్ష్మణరావు, జి.గోపాలరావు, సువ్వారి మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:57 PM