యువత నైపుణ్యం పెంపొందించుకోవాలి
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:25 PM
యువత నైపుణ్యం పెంపొందించుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపుని చ్చారు. పనిలో నైపుణ్యం పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.
నరసన్నపేట, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):యువత నైపుణ్యం పెంపొందించుకోవాలని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పిలుపుని చ్చారు. పనిలో నైపుణ్యం పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. సోమవారం నరసన్నపేటలో థ్రెడ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పారిశ్రామిక శిక్షణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల విస్తరణకు రూపొందించిన ర్యాంపు పథకం ద్వారా యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఈ జిల్లా ప్రతినిధి అరుణకుమార్ పాల్గొన్నారు.