Share News

గ్రామాభివృద్ధికి యువత ముందుకు రావాలి

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:27 AM

గ్రామాభివృద్ధికి యువత ముందుకు రావాలని, మంజూ రు చేసిన పనులు పూర్తయిన వెంటనే అద నంగా నిధులు, మరలా పనులు మంజూరు చేయిస్తానని కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్క ర్‌ అన్నారు.

గ్రామాభివృద్ధికి యువత ముందుకు రావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, చిత్రంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పోలాకి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): గ్రామాభివృద్ధికి యువత ముందుకు రావాలని, మంజూ రు చేసిన పనులు పూర్తయిన వెంటనే అద నంగా నిధులు, మరలా పనులు మంజూరు చేయిస్తానని కలెక్టర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్క ర్‌ అన్నారు. చింతువానిపేట బీటీ, కమ్మరిపేట సీసీ రహదారిని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. చింతువానిపేటలో స్థానిక యువత చందాలు వేసుకుని, భూములిచ్చి రోడ్డును నిర్మించడం అభినంద నీయమన్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ.. చెల్లాయివలస, గొల్లలవలస గ్రామపెద్దలు, యువకులు మంజూరుచేసిన రోడ్డు పనులకు అడ్డులేకుండా సొంత భూములను ఇవ్వడం శ్రద్ధ వహించి పెట్టుబడి పట్టడం అభినందనీయమన్నారు. కలెక్టర్‌ తొలుత గొల్లలవలస, తోటాడ గ్రామాలకు నిర్మించిన బీటీ రహదారి నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో వంశధార స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.లావణ్య, తహసీల్దార్‌ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో రవికుమార్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు, నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన, నాయకులు ఎం వీ నాయుడు, బీబీ రావు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 12:27 AM