సామాజికసేవకు యువత ముందుకు రావాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:56 PM
సామాజిక సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావాలని స్థాని క ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. ఆది వారం పాతపట్నంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ప్రా రంభించారు.ఈసందర్భంగా 14విభాగాలకు చెందిన వైద్యు లు 536 మందికి వైద్యసేవలందించారని నిర్వాహకులు తెలిపారు.
పాతపట్నం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): సామాజిక సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావాలని స్థాని క ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. ఆది వారం పాతపట్నంలో నిర్వహించిన వైద్యశిబిరాన్ని ప్రా రంభించారు.ఈసందర్భంగా 14విభాగాలకు చెందిన వైద్యు లు 536 మందికి వైద్యసేవలందించారని నిర్వాహకులు తెలిపారు. అలాగే పెద్దసీది జడ్పీ ఉన్నతపాఠశాలలో మద ర్ థెరిస్సా స్వచ్ఛంద సేవాసంఘం ఆధ్వర్యంలో పదోత రగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభాపరీక్షల్లో విజేత లకు బహుమతులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్ర మంలో హెచ్‌ఎం ఎన్.కుమారస్వామి, టీడీపీ నాయకులు పైల బాబ్జీ, సైలాడ సతీష్, మధుబాబు, కలమట భుజంగరావు, మన్మఽథరావు ప్రభా కరరావు, రామారావు, సన్యాసిరావు, సిర్ల జోగారావు, ప్రభాకరరావు పాల్గొన్నారు.
సేవా దృక్పథంతో వైద్యసేవలందించాలి
హరిపురం, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పాంత్రాల్లో సేవా దృక్పథంతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందించాలని మాజీ మంత్రి గౌతు శివాజీ కోరా రు. ఆదివారం హరిపురంలో కోస్టల్ లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ నిర్వహించిన ఉచిత స్త్రీ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 346 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.కార్యక్రమంలో మార్పు వెంకటేశం, కొర్ల కన్నారావు, గున్నయ్య, పుల్లా వాసు, వైఎస్‌ఎన్ మూర్తి, లక్ష్మణరావు, కొంచాడ కోటేశ్వ రరావు, బావన దుర్యోధన, నవీన్, మురళీచౌదరి, లచ్చయ్య పాల్గొన్నారు.